'ఈ గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది'... కరణం బలరాంకు మద్దతుగా చీరాలలో ప్లెక్సీల తోరణాలు!

  • చీరాల బాధ్యతలు కరణం బలరాంకు
  • నేడు నియోజకవర్గ టీడీపీ నాయకులతో సమావేశం
  • స్వాగతం పలుకుతూ పట్టణమంతా ప్లెక్సీలు
చీరాల ఎమ్మెల్యేగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడగానే, నియోజకవర్గ బాధ్యతలను కరణం బలరాంకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన్ను వెంటనే చీరాలకు వెళ్లి, టీడీపీ నాయకులతో సమావేశం కావాలని కూడా చంద్రబాబు ఆదేశించారు.

 ఆ వెంటనే చీరాల నియోజకవర్గంలోని కరణం బలరాం అనుచరగణం యాక్టివేట్ అయిపోయింది. తమ నేతకు ఘన స్వాగతం పలుకుతూ పట్టణమంతా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. పట్టణాన్ని పసుపుమయం చేశారు. "ఈ గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. రా... కదలిరా... మనల్ని నమ్మించి, వంచించిన నాయకులకు బుద్ధి చెప్పేలా రా..." అంటూ ప్లెక్సీలపై స్లోగన్స్ ముద్రించారు. పట్టణంలో ఇవి పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ మధ్యాహ్నం తరువాత కరణం బలరాం చీరాల టీడీపీ నాయకులతో సమావేశం కానున్నారు.
Go Back to Shorts
Karanam Balaram
Chirala
Chandrababu

More Telugu News